![]() |
![]() |
.webp)
కార్తీకదీపం సీరియల్ లో హీరో, హీరోయిన్ కి ఎంత పేరొచ్చిందో లేడీ విలన్ గా మోనిత అలియాస్ శోభా శెట్టికి కూడా అంతే పేరొచ్చింది. ఆ నేమ్ అండ్ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చింది శోభా.. మిగతా హౌస్ మేట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక తన ఫాన్స్ కి టచ్ లో ఉంటోంది. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తుంది శోభాశెట్టి.
ఇప్పుడు తాజాగా ఫ్రాడ్ కాల్స్, సైబర్ నేరాల గురించి ఓ వీడియోని చేసింది. సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పొరపాటున మనం ఒక్క లింక్ క్లిక్ చేసిన మన డబ్బలన్నీ స్వాహా చేసేస్తున్నారు కేటుగాళ్లు. మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ హైక్ చేయడానికి యాప్ ఓపెన్ చేయండి.. ఓటీపీ ఎంటర్ చేయండి.. క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.. మేం ఆన్ లైన్‌లోనే ఉంటాం.. మీరు యాప్ ఓపెన్ చేసి బిల్లు చెల్లించండి.. ఇలా రకరకాలుగా ఫోన్లు చేస్తుంటారు. వాళ్లు చెప్పినట్టు చేస్తే.. ఉచ్చులో పడ్డట్టే.. జేబులే కాదు.. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయినట్టే అంటు శోభాశెట్టి అంది.
ఫ్రాడ్ కాల్స్ శోభాశెట్టికి వస్తే తను ఎలా తిప్పికొట్టిందో చెప్పింది. కస్టమర్ కేర్ లాగా ఒకడు కాల్ చేసి తెలివిగా ఉండేందుకు ప్రయత్నించాడు. నేను తెలివైన అమ్మాయిని అని అతనికి చూపించాను! యూపీఐ (UPI) మనకు తెలియని యాప్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయవద్దని.. ధృవీకరించని మూలాల నుండి లింక్‌లపై క్లిక్ చేయవద్దనే చెబుతుంది. కస్టమర్ సర్వీస్ కాల్‌ల ప్రామాణికతను ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.. అధికారిక ఛానెల్‌లలో మాత్రమే చెల్లింపులు చేయండి. నకిలీ బిల్లు చెల్లింపు కాల్‌లు, ఎస్ఎంఎస్‌లను నమ్మొద్దు.. ఆ లింక్‌లను క్లిక్ చేయొద్దంటు శోభాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |